స్థానిక ఎన్నికలపై కసరత్తు
మున్సిపల్ అధికారులతో 6న ఎన్నికల కమిషనర్ భేటీ అమరావతి, 31 జూలై 2026, భారత్ ప్రతినిధి : రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పునేఠా ఈ నెల 6న మున్సిపల్, పంచాయతీరాజ్ అధికారులతో భేటీ కానున్నారు. స్థానికసంస్థల ఎన్నికలకు సంబంధించిన కసరత్తు ప్రారంభించేలా దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే బీసీ రిజర్వేషన్ల కోసం డెడికేటెడ్ కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత రిజర్వేషన్ల ప్రక్రియ చేపట్టాల్సి ఉంది. కమిషన్‌కు అవసరమైన బీసీ జనాభా వివరాలను పంచాయతీరాజ్‌శాఖ అందించింది. ముందు మున్సిపల్, ఆ...