Thursday, September 10, 2026
spot_imgspot_img

శ్రీలంక ఎలెవన్‌ వార్మప్ మ్యాచ్ లో టీమిండియా విజయం

Must read

📰 Generate e-Paper Clip

క్రికెట్ డెస్క్, భారత్ ప్రతినిధి : శ్రీలంక ఎలెవన్‌తో కొలంబో వేదికగా జరిగిన మూడు రోజుల వార్మప్ టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడో రోజు 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. యశస్వి జైస్వాల్(61*) హాఫ్ సెంచరీ చేసి రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. గాయం బారిన పడిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్(44) నేడు బ్యాట్ పట్టాడు. స్టార్ బౌలర్ సిరాజ్(32*) కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆఖరిలో హ్యాట్రిక్ సిక్సర్లు బాది ఆశ్చర్యపరిచాడు. శ్రీలంక ఎలెవన్ బౌలర్లలో కేషారా 2 విశ్వా ఫెర్నాండో, రమేశ్ మెండీస్ తలొక వికెట్ పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక ఎలెవన్ 363/8 వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. తొలి రోజు వికెట్లు తీయడానికి ఇబ్బంది పడిన భారత బౌలర్లు.. రెండో రోజు రాణించారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 357/6 వద్ద డిక్లేర్ ఇచ్చింది. దేవదత్ పడిక్కల్(142) సూపర్ సెంచరీ చేశాడు. రవీంద్ర జడేజా(63) రాణించాడు. రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక ఎలెవన్ 200/6 వద్ద డిక్లేర్ ప్రకటించింది. తొలి ఇన్నింగ్స్‌తో కలిపి 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. అద్భుతంగా ఛేదించింది.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article

App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.