శ్రీలంక ఎలెవన్‌ వార్మప్ మ్యాచ్ లో టీమిండియా విజయం

క్రికెట్ డెస్క్, భారత్ ప్రతినిధి : శ్రీలంక ఎలెవన్‌తో కొలంబో వేదికగా జరిగిన మూడు రోజుల వార్మప్ టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడో రోజు 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. యశస్వి జైస్వాల్(61*) హాఫ్ సెంచరీ చేసి రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. గాయం బారిన పడిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్(44) నేడు బ్యాట్ పట్టాడు. స్టార్ బౌలర్ సిరాజ్(32*) కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర...