Friday, September 11, 2026
spot_imgspot_img

నషా ముక్త్ యువ ప్రచారంలో యువత చురుకైన భాగస్వామ్యం

Must read

📰 Generate e-Paper Clip

గుంటూరు, 02 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : మాదకద్రవ్య రహిత భారతదేశ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై యువతలో అవగాహన పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నషా ముక్త్ యువ ప్రచారంలో భాగంగా శనివారం గుంటూరులోని భారత ప్రభుత్వము, కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ, మేరా యువ భారత్, గుంటూరు మరియు ప్రభుత్వ మహిళా కళాశాల (స్వయంప్రతిపత్తి) సంయుక్త ఆద్వర్యం లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశంలోని యువతను వర్చువల్ విధానంలో ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణం, ఆరోగ్యకరమైన జీవనశైలి, యువత బాధ్యతలపై సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమానికి మేరా యువ భారత్ , గుంటూరు డిప్యూటీ డైరెక్టర్ కిరణ్మయి దేవిరెడ్డి, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ఏ. సంతోష్ కుమారి పాటు, అధికారులు, కళాశాల సిబ్బంది మరియు యువత పాల్గొన్నారు.ఈ సందర్భంగా నషా ముక్త్ యువ ప్రచారంలో చురుకుగా పాల్గొన్న యువతకు పాల్గొనడం ధృవీకరణ పత్రాలు అందజేశారు. మాదకద్రవ్య రహిత భారతదేశ నిర్మాణం కోసం యువతను భాగస్వాములను చేస్తూ మేరా యువ భారత్ ఆధ్వర్యంలో ఇటువంటి అవగాహన కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తున్నట్లు మేరా యువ భారత్, గుంటూరు ఉప సంచాలకులు కిరణ్మయి దేవిరెడ్డి తెలిపారు

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article

App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.