జీఎంసీ కమిషనర్ కె.మయూర్ అశోక్
గుంటూరు, 06 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఏపీ స్టేట్ క్రియేటివిటీ & కల్చర్ కమిషన్ ఆధ్వర్యంలో ఈ నెల 8, 9 తేదీల్లో గుంటూరు నగరంలో జరగనున్న ‘అమరావతి చిత్రకళా వీధి’ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని జీఎంసీ కమిషనర్ కె.మయూర్ అశోక్ విభాగాధిపతులను ఆదేశించారు. గురువారం ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్రియేటివిటీ & కల్చర్ కమిషన్ ఛైర్సన్ పొడపాటి తేజస్వి అధికారులతో కలిసి గుజ్జనగుండ్ల సెంటర్ నుంచి విద్యానగర్ వరకు పరిశీలించారు. సందర్శకులకు ఇబ్బంది లేకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా పి. తేజస్వి విజ్ఞప్తి చేశారు.


