Thursday, September 10, 2026
spot_imgspot_img

షర్మిల ఆరోగ్యంపై గుంటూరులో ప్రత్యేక ప్రార్థనలు

Must read

📰 Generate e-Paper Clip

గుంటూరు, 30 జూలై 2026, భారత్ప్రతినిధి న్యూస్ : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని గుంటూరులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఏపీసీసీ మైనారిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ చుక్క చంద్రపాల్ ఆధ్వర్యంలో గుంటూరులోని పునీత అంతోని వారి పుణ్యక్షేత్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు యన్నం సుధీర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవల శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తైన వైఎస్ షర్మిల త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని ప్రజాసేవలో తిరిగి చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఖలీల్, మల్లెల మోషే, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని వైఎస్ షర్మిల త్వరగా కోలుకోవాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article

App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.