గుంటూరు, 30 జూలై 2026, భారత్ ప్రతినిధి : ఆచార్య నాగార్జున యూనివర్సిటీ రసాయన శాస్త్ర విభాగం ప్రొఫెసర్ హరిబాబు బ్రిటన్ కు చెందిన ప్రతిష్ఠాత్మక ‘రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ’ (ఆర్ఎస్సి) ఫెలో (ఎఫ్.ఆర్.ఎస్.సి)గా ఎన్నికయ్యారు. రసాయన శాస్త్ర రంగంలో ఆయన చేసిన విశేష పరిశోధనలు, బోధనా ప్రతిభ, శాస్త్రీయ నాయకత్వం, సమాజానికి అందించిన సేవలను గుర్తించి ఈ అరుదైన గౌరవాన్ని ప్రదానం చేశారు. ఇకపై ఆయన తన పేరుకు ముందు లేదా వెనక “ఎఫ్.ఆర్.ఎస్.సి” హోదాను ఆర్ఎస్ఎస్సి అధికారికంగా వెల్లడించింది.


