Friday, September 11, 2026
spot_imgspot_img

అఖిల భారత శరీర అవయువ దాతల సంఘం ఆధ్వర్యంలో ఆగస్టు 3న ఆర్గాన్ డొనేషన్ డే వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

గుంటూరు, 31 జూలై 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : భారత శరీర అవయువ దాతల సంఘం ఆధ్వర్యంలో ఈనెల 3వ తేదీన గుంటూరులో జాతీయ, అంతర్జాతీయ ఆర్గాన్ డొనేషన్ డే వేడుకలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా 3వ తేదీన నగరంలో అవగాహన ర్యాలీ, సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందని సంఘం అధ్యక్షుడు డాక్టర్ రమణ యసశ్వీ, మెంబర్ రాధారాణి తెలిపారు. అంబేద్కర్ సర్కిల్ నుంచి అమరావతి రోడ్ హిందూ ఫార్మసీ కళాశాల వరకు ప్రదర్శన సాగుతుందని అన్నారు. మరణించినా జీవించండి అనే నినాదంతో ఆర్గాన్ డొనేషన్ పై గుంటూరులో 10 రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు కొనసాగుతాయని వారు వెల్లడించారు. బ్రెయిన్ డెడ్ అయిన వారు అవయువాలు దానం చేస్తే మరో ఎనిమిది మందికి పునర్ జన్మను ఇవ్వొచ్చు అని చెప్పారు. అవయువ దానం పట్ల యువత అవగాహన పెంచుకోవాలని సూచించారు. అపోహలు తొలగించుకుని జీవన్ ధాన్ పధకంలో పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article

App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.