
గుంటూరు, 11 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు మంగళవారం నల్ల రిబ్బన్లు ధరించి సమ్మె చేపట్టారు. స్టైఫండ్ పెంచాలని, గత రెండేళ్ళుగా తమకు స్టైఫండ్ పెంచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కర్ణాటకలో కూడా తాజాగా స్టైఫండ్ పెంచారని గుర్తుచేశారు. రిటైర్మెంట్ వయస్సు పెంపుదల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ సమ్మె కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.


