గుంటూరు, 10 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు రూరల్ మండలం తురకపాలెం మిస్టరీ మరణాలపై NHRC కి నిస్పాక్షిక నివేదిక ఇవ్వాలని విదసం ఐక్యవేదిక కార్యదర్శి డా. బూసి వెంకటరావు డిమాండ్ చేశారు. ఇదే అంశంపై సోమవారం గుంటూరు కలెక్టరేట్లో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలుషిత నీటి మరణాలపై నష్టపరిహారం, వితంతు పెన్షన్లు మంజూరు చేయాలని, తిరుపతి తొక్కిసలాట నష్టపరిహారం సమానంగా తురకపాలెం బాధితులకు 25 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు.


