ఇంద్రకీలాద్రిపై ముగిసిన ఉత్సవాలు
విజయవాడ, 28 జూలై 2026, భారత్ ప్రతినిధి : ఇంద్రకీలాద్రిపై వెలసిన బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో శాకంబరీ ఉత్సవాలు ఇవాల్టితో ముగిశాయి. సోమవారం ప్రారంభమైన ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు కనుల పండువగా సాగాయి. అమ్మవారిని దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఈ మూడు రోజుల పాటు అమ్మవారు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. శాకంబరీ ఉత్సవాల సందర్భంగా ఆలయం మొత్తాన్ని పండ్లు, కూరగాయలతో అలంకరించారు. అమ్మవారిని కూడా పండ్లు, కూరగాయలతో పాటు డ్రై ఫ్రూట్లతో ప్రత్యేకంగా అలంకరించారు.
ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రి పై శాకంబరీ ఉత్సవాలు ముగిశాయి. మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ ఉత్సవాల్లో దుర్గమ్మ తల్లి శాకంబరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. చివరి రోజు కావడంతో బుధవారం అమ్మవారిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. శాకంబరీ ఉత్సవాల సందర్భంగా అమ్మవారు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారి అలంకరణ అందర్నీ ఆకట్టుకుంది.
సకాలంలో వర్షాలు కురవాలనే ఉద్దేశంతో ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో ఈ శాకంబరీ ఉత్సవాలను నిర్వహిస్తారని ఆలయ సిబ్బంది చెబుతున్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని పండ్లు, కూరగాయలతో ప్రత్యేకంగా అలంకరిస్తారు. రైతులు సుభిక్షంగా ఉండేలనే వ్యవసాయంలో పండించే వాటిని అమ్మవారికి సమర్పిస్తారు. ప్రకృతి వ్యవసాయం, ఆహార సంపదకు ప్రతీకగా అమ్మవారిని కొలుస్తారు.


