శాకంబరీ అలంకరణలో బెజవాడ కనకదుర్గమ్మ

ఇంద్రకీలాద్రిపై ముగిసిన ఉత్సవాలు విజయవాడ, 28 జూలై 2026, భారత్ ప్రతినిధి : ఇంద్రకీలాద్రిపై వెలసిన బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో శాకంబరీ ఉత్సవాలు ఇవాల్టితో ముగిశాయి. సోమవారం ప్రారంభమైన ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు కనుల పండువగా సాగాయి. అమ్మవారిని దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఈ మూడు రోజుల పాటు అమ్మవారు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. శాకంబరీ ఉత్సవాల సందర్భంగా ఆలయం మొత్తాన్ని పండ్లు, కూరగాయలతో అలంకరించారు. అమ్మవారిని కూడా పండ్లు, కూరగాయలతో పాటు డ్రై ఫ్రూట్లతో ప్రత్యేకంగా అలంకరించారు....