Thursday, September 10, 2026
spot_imgspot_img

ముందుగానే జనగణన.. 4 రాష్ట్రాలకు కేంద్రం నోటిఫికేషన్‌ జారీ

Must read

📰 Generate e-Paper Clip

న్యూఢిల్లీ, 05 సెప్టెంబర్‌ 2026 : జనగణన 2027 ప్రక్రియలో భాగంగా గోవా, ఉత్తర్‌ ప్రదేశ్‌, పంజాబ్‌, మంచు ఉండని ఉత్తరాఖండ్‌ ప్రాంతాలలో జనాభా లెక్కింపు షెడ్యూల్‌ను కేంద్ర ప్రభుత్వం ముందుగానే చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం శనివారం జారీచేసిన నోటిఫికేషన్‌ ప్రకారం ఈ రాష్ట్రాలు, ప్రాంతాల్లో జన గణన డిసెంబర్‌ 1 నుంచి 2027 జనవరి 4 వరకు జరుగుతుంది. అనంతరం జనవరి 5 నుంచి 9 వరకు సమీక్ష దశ నిర్వహిస్తారు. జన గణన చట్టం, 1948, జన గణన నియమావళి, 1990లో నిబంధనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు నోటిఫికేషన్‌ పేర్కొన్నది. భారత రిజిస్ట్రార్‌ జనరల్‌(ఆర్‌జీఐ) కూడా ఈ షెడ్యూల్‌ను ధృవీకరించారు. కాగా ఈ ఆకస్మిక చర్యను కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరామ్‌ రమేశ్‌ ప్రశ్నించారు. ఇది ప్రభుత్వ పేలవమైన ప్రణాళికను ప్రతిబింబిస్తుందని ఆయన విమర్శించారు. 2027లో నాలుగు రాష్ర్టాల్లో ఎన్నికలు జరగనున్నాయని ప్రభుత్వానికి తెలిసినప్పటికీ గణన ప్రక్రియను ఇప్పుడు ఎందుకు ముందుకు జరుపుతున్నారని ఆయన ప్రశ్నించారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article

App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.