ముందుగానే జనగణన.. 4 రాష్ట్రాలకు కేంద్రం నోటిఫికేషన్‌ జారీ

న్యూఢిల్లీ, 05 సెప్టెంబర్‌ 2026 : జనగణన 2027 ప్రక్రియలో భాగంగా గోవా, ఉత్తర్‌ ప్రదేశ్‌, పంజాబ్‌, మంచు ఉండని ఉత్తరాఖండ్‌ ప్రాంతాలలో జనాభా లెక్కింపు షెడ్యూల్‌ను కేంద్ర ప్రభుత్వం ముందుగానే చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం శనివారం జారీచేసిన నోటిఫికేషన్‌ ప్రకారం ఈ రాష్ట్రాలు, ప్రాంతాల్లో జన గణన డిసెంబర్‌ 1 నుంచి 2027 జనవరి 4 వరకు జరుగుతుంది. అనంతరం జనవరి 5 నుంచి 9 వరకు సమీక్ష దశ నిర్వహిస్తారు. జన గణన చట్టం, 1948, జన గణన నియమావళి, 1990లో...