Friday, September 11, 2026
spot_imgspot_img

స్థానిక సమస్యలను సత్వరమే పరిష్కరించాలి

Must read

📰 Generate e-Paper Clip

బిజెపి గొల్లపూడి మండల అధ్యక్షుడు దుద్దుకూరి తిరుపతి నాయుడు

గొల్లపూడి సమస్యల పరిష్కారం కోసం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వినతిపత్రం

గొల్లపూడి, 28 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : జనతా వారధి కార్యక్రమంలో భాగంగా గొల్లపూడి ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య లను సత్వరమే పరిష్కరించాలని కోరుతూ ఏపీ బీజేపీ హెడ్ క్వార్టర్ ఇంచార్జి ఉప్పలపాటి శ్రీనివాసరాజు కు బీజేపీ గొల్లపూడి మండల అధ్యక్షుడు దుద్దుకూరి తిరుపతి నాయుడు స్థానిక బిజెపి నాయకులతో కలసి వినతిపత్రం అందించారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో వినతిపత్రం అందించిన తరువాత మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ముఖ్యంగా ఎస్ ఎస్ ఎస్ కాలని మరియు గొల్లపూడి వ్యాప్తంగా ఉన్న ప్రధాన సమస్యలైన మంచినీటి సరఫరా లైన్లు పాడైపోయి సరిగా లేనందున క్షిత మంచినీరు అందుబాటులో లేదని, రోడ్లు పారిశుధ్యం సమస్యఎక్కువగా ఉండడం వలన దోమలుబెడద ఎక్కువగా ఉందని, మురుగునీరు పోయే అవకాశం లేకపోవడం వల్ల స్థలాల్లో నీరు నిలిచిపోయి దోమల వలన ప్రజలు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నందున డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం అందించడం జరిగిందని దుద్దుకూరి తిరుపతి నాయుడు తెలిపారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article

App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.