గుంటూరు, 28 ఆగస్ట్ 2926, భారత్ ప్రతినిధి న్యూస్ : రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని ఉండవల్లి నివాసంలో వేడుక నిర్వహించారు. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి రాఖీ కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. తెలుగింటి ఆడపడుచులకు ఈ సందర్భంగా మంత్రి లోకేష్ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో గళ్ళా రామచంద్రరావు కూడా పాల్గొన్నారు.


