గుంటూరు, 19 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : మిషన్ శక్తి పథకం కింద గుంటూరు, తుళ్లూరు వన్ స్టాప్ సెంటర్లలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు ఈ నెల 22వ తేదీ శనివారం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారత అధికారి పి పి జి ప్రసూన తెలిపారు. వన్ స్టాప్ సెంటర్ పథకం కింద ఒక కేస్ వర్కర్, రెండు మల్టీ పర్పస్ స్టాఫ్ పోస్టుల భర్తీకి ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారని, అభ్యర్థుల ఇంటర్వ్యూలు ఈ నెల 22 న ఉదయం 10.30 గంటలకు మహిళా ప్రాంగణంలోని వన్ స్టాప్ సెంటర్‌లో నిర్వహించనున్నట్లు ఆమె పేర్కొన్నారు.


