Friday, September 11, 2026
spot_imgspot_img

గుంటూరు లో ఘనంగా ఏ‌పి‌యూ‌డబ్లూజే 70వ ఆవిర్భావ దినోత్సవం

Must read

📰 Generate e-Paper Clip

నగర కమిటీ ఆధ్వర్యం లో భారీ బైక్ ర్యాలీ

హిందూ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో “సోషల్ మీడియా ప్రభావం-సైబర్ నేరాలు-ఏఐ టెక్నాలజీలపై సెమినార్

గుంటూరు, 17 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : నానాటికి శృతిమించుతున్న సైబర్ నేరాలపై ప్రజలను వ్యవస్థను చైతన్యవంతo చేయవలసిన బాధ్యత రాజ్యాంగంలో నాలుగవ స్తంభమైన పాత్రికేయ రంగం పైనే బలంగా ఉన్నదని ఇస్రో నాసా పూర్వ శాస్త్రవేత్త ప్రముఖ మేధావి చందు సాంబశివరావు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ 70వ ఆవిర్భావ దినోత్సవం గుంటూరు నగర శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి పెద్ద ఎత్తున ద్విచక్ర వాహనాలు పై సంఘం జెండాలుతో ర్యాలీగా అమరావతి రోడ్డు హిందూ ఇంజనీరింగ్ కళాశాలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా హిందూ ఇంజనీరింగ్ కళాశాల సమావేశ మందిరం లో జరిగిన “సోషల్ మీడియా ప్రభావం-సైబర్ నేరాలు-ఏఐ టెక్నాలజీలపై సెమినార్ నిర్వహించారు.

ముఖ్య అతిథిగా పాల్గొన్న శాస్త్రవేత్త సాంబశివరావు మాట్లాడుతూ, జెన్ జీ కాలంలో సైబర్ నేరాలు అరికట్టేందుకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్సీ ఎంతగానో అవసర పడుతున్నదన్నారు. ప్రజాస్వామ్యంలో జర్నలిజం ప్రాధాన్యత గురించి సరైన అవగాహన లేకపోవడం, పారిశ్రామికవేత్తల చేతుల్లో జర్నలిజం బందీ అయిపోవటం బాధాకరమన్నారు. పాత్రికేయుల వృత్తికి రక్షణ గౌరవం కల్పించాల్సిన బాధ్యత అన్ని పార్టీలపై ప్రభుత్వాలపై ఖచ్చితంగా ఉందన్నారు. 8 దశాబ్దాల భారత ప్రజాస్వామ్యంలో 24 గంటలు శ్రమకోర్చి విధులు నిర్వహించే విలేకరులకు కనీస వేతన చట్టాలు కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, పత్రికా యాజమాన్యాలు విఫలమవటంపై దృష్టి సారించాలని చెప్పారు. ఆరోగ్యవంతమైన సమాజం కోసం ఫేక్ అకౌంట్స్ ఉపయోగించే వారిని కట్టడి చేసేలా జర్నలిస్టులు పోరాడాలని కోరారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం జర్నలిజం విభాగాధిపతి డాక్టర్ కె. జ్యోతిర్మయి మాట్లాడుతూ, జర్నలిస్టుల హక్కుల పరిరక్షణలో మన దేశం 150వ స్థానంలో ఉండటం బాధాకరమన్నారు. సోషల్ మీడియా సైబర్ సెల్ పోలీస్ అధికారి కిషోర్ మాట్లాడుతూ, అనేక క్లిష్టతరమైన సైబర్ నేరాలను అరికట్టడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దోహదపడుతుండదని చెప్పారు. విద్యార్థులు, యువత నకిలీ సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.

సభకు అధ్యక్షత వహించిన నగర అధ్యక్షులు కొంగర వెంకయ్య మాట్లాడుతూ, వర్కింగ్ జర్నలిస్టుల పై జరిగే అన్ని రకాల దాడులను సంఘటితంగా అరికట్టడంలో ఏపీయూడబ్ల్యూజే గట్టిగా కృషి చేస్తున్నదని చెప్పారు. వర్కింగ్ జర్నలిస్టులకు 25 లక్షల కుటుంబ ఆరోగ్య భీమా, ఇళ్ల నిర్మాణాలు, ఉచిత రైల్వే పాసులు అందించాలని తమ యూనియన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులను ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో హిందూ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిహెచ్ సుబ్బారావు, హిందూ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నాగభూషణం, డాక్టర్ సీతారామయ్య, డాక్టర్ సుస్మిత, ఐఎంఏ జిల్లా అధ్యక్షులు డాక్టర్ సేవకుమార్, ఐజేయు కేంద్ర కార్యవర్గ సభ్యులు గిరి, ఏపీడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు ఫణి, భక్తవత్సలరావు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు షేక్ నాగుల్ మీరా, రాంబాబు, విఎల్ నరసింహారావు, నగర కార్యదర్శి కార్తీక్ రెడ్డి, తిరుపతి రెడ్డి, ఆళ్ల వీరభద్రరావు, లూర్దు రాజు, సుజిబాబు, సామ్నా  గుంటూరు జిల్లా కమిటీ అధ్యక్ష కార్యదర్శులు రోళ్ళ రఘునాథ్ రెడ్డి, చెరుకూరి శ్రీనివాస్ రావు, సభ్యులు జహీరుల్లా, శ్రీనివాసులు, ఇండ్ల శ్రీధర్ బాబు, ఎం. శ్రీనివాస్, షైక్. రెహ్మాన్, రాజు, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article

App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.