ఉదయం 8 గంటల నుంచి ఎమర్జెన్సీ సేవల బహిష్కరణ..
స్టయిఫండ్ పెంపుపై ప్రభుత్వ స్పందన రాకపోవడంతో నిర్ణయం..
అమరావతి, భారత్ ప్రతినిధి న్యూస్ : స్టైఫండ్ పెంపుతో పాటు తమ సమస్యలను పరిష్కరించాలని జూడాలు కొంతకాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. చర్చల్లో 30 శాతం పెంపు కోరిన జూడాలకు ప్రభుత్వం 3 శాతం పెంపు ప్రతిపాదించడంతో అసంతృప్తి వ్యక్తమైంది. దీంతో దశలవారీ ఆందోళనకు దిగారు. తాజా సమ్మె నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ వైద్య సేవల తో పాటు రేపటి నుంచి అత్యవసర సేవలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉండటంతో ప్రభుత్వం, జూడాల మధ్య చర్చలు కీలకంగా మారాయి.


