జాతీయ వన్యప్రాణి వారోత్సవం – 2026 పోస్టర్ విడుదల
గుంటూరు, 07 అక్టోబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : వన్యప్రాణుల సంరక్షణతో పాటు వాటి సహజ ఆవాసాలను పరిరక్షించి, విభజించబడిన అడవులు మరియు సహజ ప్రాంతాలను అనుసంధానం చేయడం ద్వారా వన్యప్రాణులకు సురక్షిత సంచార మార్గాలు కల్పించాలని ముఖ్య అతిథి వయోజన విద్య శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ కె. ఆంజనేయులు పిలుపునిచ్చారు. “ఆవాసాలను అనుసంధానిద్దాం – వన్యప్రాణులు వృద్ధి చెందేలా చేద్దాం” అనే సందేశంతో జాతీయ వన్యప్రాణి వారోత్సవం–2026 సందర్భంగా ప్రజల్లో, ముఖ్యంగా విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని...