వైఎస్సార్ సేవలు చిరస్మరణీయం
17వ వర్ధంతి సందర్భంగా వైఎస్‌ఆర్‌సిపి శ్రేణులు ఘన నివాళులు గుంటూరు, 02 సెప్టెంబర్ 2026, భరత్ ప్రతినిధి న్యూస్ : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా గుంటూరు నగరంలోని 25వ వార్డు లక్ష్మీనగర్, నల్లపాడు రోడ్డులోని వైఎస్సార్ విగ్రహం వద్ద వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ యేసురత్నం, నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌చార్జి మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థుల సంక్షేమానికి...