BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 02 September 2026, 1:53 pm Posted by : Raghunath Rolla

వైఎస్సార్‌ సేవలు చిరస్మరణీయం

17వ వర్ధంతి సందర్భంగా వై‌ఎస్‌ఆర్‌సి‌పి శ్రేణులు ఘన నివాళులు

గుంటూరు, 02 సెప్టెంబర్ 2026, భరత్ ప్రతినిధి న్యూస్ : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా గుంటూరు నగరంలోని 25వ వార్డు లక్ష్మీనగర్‌, నల్లపాడు రోడ్డులోని వైఎస్సార్‌ విగ్రహం వద్ద వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ యేసురత్నం, నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌చార్జి మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌ పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థుల సంక్షేమానికి చేసిన కృషిని వారు స్మరించుకున్నారు. వైఎస్సార్‌ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకొచ్చాయని నాయకులు పేర్కొన్నారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన వైఎస్సార్‌ సేవలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. వైఎస్సార్‌ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలకు అండగా ఉంటూ వారి సమస్యలపై నిరంతరం పోరాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ప్రచార కమిటీ వైస్‌ ప్రెసిడెంట్‌ ముక్కు శివశంకర్‌రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, కృష్ణారెడ్డి, పరమేశ్వర్‌రెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్‌ అభిమానులు పాల్గొన్నారు. వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వైఎస్సార్‌ ప్రజా సంక్షేమం కోసం చేసిన సేవలను స్మరించుకుంటూ, ఆయన ఆశయాల సాధనకు కృషి చేయడమే ఆయనకు నిజమైన నివాళి అని నాయకులు పేర్కొన్నారు.