గుంటూరు, 24 సెప్టెంబర్ 2026, భారత ప్రతినిధి న్యూస్ : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావును టీడీపీ యువ నాయకులు మాదల చైతన్య గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు కొద్దిసేపు ఆత్మీయంగా ముచ్చటించారు. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలు, పార్టీ భవిష్యత్ కార్యక్రమాలపై ప్రధానంగా చర్చించారు. మాదల చైతన్య మాట్లాడుతూ.. పార్టీ పట్ల పల్లా శ్రీనివాసరావు నిబద్ధత, కార్యకర్తల పట్ల చూపే ఆప్యాయత, ప్రజాసేవలో ఆయన అంకితభావం ఎల్లప్పుడూ యువతకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ కలయిక తనకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చిందని, ఆయన విలువైన సూచనలు, ఆశీస్సులు తనకు ఎల్లవేళలా మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే కాకుండా, ప్రజాసేవే పరమావధిగా ముందుకు సాగాలని పల్లా శ్రీనివాసరావు ఈ సందర్భంగా చైతన్యకు దిశానిర్దేశం చేశారు. పార్టీ పెద్దల మార్గదర్శకత్వంలో ఎల్లప్పుడూ ప్రజలకు చేరువగా ఉంటూ, ప్రజా సమస్యల పరిష్కారం, సేవా కార్యక్రమాలతో ముందుకెళ్తానని మాదల చైతన్య స్పష్టం చేశారు.