అగ్ర వర్గాలకు చెందిన వారు చనిపోతే ఒక విధంగా, పేద వర్గాలకు చెందినవారు చనిపోతే ఒక విధంగా స్పందిస్తారా..?
దళిత, బహుజన, ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహాం..

గుంటూరు జిల్లా తాడికొండ పోలీస్ స్టేషన్లో పోలీసుల దాడి వల్లనే దళిత యువకుడు చీకటి గోపి మరణించాడని కేవీపీస్ (KVPS) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మల్యాద్రి అన్నారు. ఇదే అంశంపై మంగళవారం గుంటూరులోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ నెల 17 న గుంటూరు కలెక్టరేట్ ఎదుట చేపట్టనున్న ధర్నా పోస్టర్ ను ఆవిష్కరించారు. అండ్ర మల్యాద్రి మాట్లాడుతూ విజయవాడలో గాదె సాయి కృష్ణ లాకప్ డెత్ లో ఇదేవిధంగా వ్యవహరించారా అని ప్రశ్నించారు. మరణించినప్పుడు అగ్రకులాలను ఒక విధంగా, పేద కులాలను ఒక విధంగా ఆదుకుంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.