హోటళ్లపై వీఎంసీ కొరడా

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు.. రూ.26 వేల జరిమానా విజయవాడ, 05 సెప్టెంబర్‌ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : నగరంలోని హోటళ్లు, టిఫిన్‌ సెంటర్లు, ఆహార విక్రయ కేంద్రాలపై వీఎంసీ ప్రజారోగ్య విభాగం అధికారులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. కమిషనర్‌ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు చేపట్టిన తనిఖీల్లో ఆహార నాణ్యత, పరిసరాల పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ, సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రతను పరిశీలించారు. అంబేద్కర్‌ కాలనీ 3వ లైన్‌లోని ప్రియా ఎగ్జిక్యూటివ్‌ బాయ్స్‌ హాస్టల్‌ను తనిఖీ చేసి నిబంధనలు పాటించకపోవడంతో రూ.1,000 జరిమానా విధించారు....