విజయవాడలో అపరిశుభ్ర హోటళ్లపై వీఎంసీ కొరడా
కెనాల్ రోడ్డులోని హోటళ్లలో ప్రజారోగ్య విభాగం ఆకస్మిక తనిఖీలు మూడు హోటళ్లకు ఒక్కొక్కదానికి రూ.5,000 జరిమానా లోపాలు సరిదిద్దకుంటే ట్రేడ్ లైసెన్సులు రద్దు చేస్తామని కమిషనర్ ధ్యానచంద్ర హెచ్చరిక విజయవాడ, 04 సెప్టెంబర్ 2026, భరత్ ప్రతినిధి న్యూస్ : నగర ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ, కనీస పారిశుద్ధ్య ప్రమాణాలు పాటించని హోటళ్లు, ఆహార విక్రయ కేంద్రాలపై విజయవాడ నగరపాలక సంస్థ (వీఎంసీ) కఠిన చర్యలకు ఉపక్రమించింది. వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు ప్రజారోగ్య విభాగం అధికారులు శుక్రవారం ఉదయం నగరంలోని...