పర్యావరణ హిత ‘గ్రీన్ గణేష్’ విగ్రహాలతో వినాయక చవితి వేడుకలు జరుపుకుందాం

నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ గుంటూరు, 05 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : పర్యావరణాన్ని పరిరక్షిస్తూ, కాలుష్య రహితంగా వినాయక చవితి పండుగను జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ నెల 11వ తేదీన నగరంలో సుమారు 25 వేల మంది విద్యార్థులతో మట్టి వినాయక ప్రతిమల తయారీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. శనివారం నగరపాలక సంస్థ కాన్ఫరెన్స్ హాల్‌లో వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యాశాఖ, జిఎంసి అధికారులతో "ఎకో ఫ్రెండ్లీ వినాయక చవితి" వేడుకల నిర్వహణపై...