ఎన్.హెచ్.ఎ.ఐ అధికారులతో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని సమీక్ష

గుంటూరు, 01 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్‌ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో ఎన్ హెచ్ ఎ ఐ రీజినల్ ఆఫీసర్, ప్రాజెక్ట్ డైరెక్టర్‌లతో పెమ్మసాని క్యాంప్ కార్యాలయంలో సమీక్ష సమావేశం మంగళవారం నిర్వహించారు. గుంటూరు - విజయవాడ పరిసర ప్రాంతాల్లో జాతీయ రహదారులకు సంబంధించిన కీలక సమస్యలు, పెండింగ్‌ పనుల పురోగతిపై ఈ సందర్భంగా అధికారులతో కేంద్ర మంత్రి సమగ్రంగా చర్చించారు. సమావేశంలో ప్రధానంగా వెస్ట్ బైపాస్‌పై చిన్నకాకాని ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించిన...