BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 06 September 2026, 2:18 am Posted by : Raghunath Rolla

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్దం కావాలి

గుంటూరు నగర కమిషనర్ కె. మయూర్ అశోక్

గుంటూరు, 05 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్దం కావాలని నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ ఎన్నికల విధులు కేటాయించబడిన ఆర్.ఓ, ఏ.ఆర్.ఓ (రిటర్నింగ్ ఆఫీసర్ , అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్) లను ఆదేశించారు. శనివారం నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఎన్నికల విధులు కేటాయించబడిన ఆర్.ఓ, ఏ.ఆర్.ఓలతో ఎన్నికల సంన్నద్దత పై ప్రత్యేక సమావేశం నిర్వహించి తీసుకోవాల్సిన చర్యల పై తగు ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రాష్ట్ర ఎన్నికల సంఘం త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడానికి సమాయత్తం అవుతుందన్నారు. ఎన్నికల నిర్వహణకు అధికారులు సిబ్బంది అందరు సిద్దంగా ఉండాలని ఆదేశించారు. ఈ సందర్భంగా నగరంలో వార్డుల డిలిమిటేషన్ కు సంబంధించిన ప్రక్రియ జరుగుతుందని, ప్రస్తుతం నగరంలో 57 వార్డులు ఉన్నాయని, ఇక నుంచి 76 వార్డులుగా డి లిమిటేషన్ చేసి, రాజకీయ పార్టీల మరియు ప్రజాభిప్రాలను సేకరించి ఎన్నికలు నిర్వహించుట జరుగుతుదన్నారు. ఎన్నికల విధులు కేటాయించబడిన ఒక్కొక్క ఆర్.ఓ కి 3 లేదా 4 వార్డులను కేటాయించుట జరుగుతుందన్నారు. స్థానిక ఎన్నికల నిర్వహణలో ఆర్.ఓ ల పాత్ర ఎంతో ముఖ్యమని, రిటర్నింగ్ అధికారి హోదాలో విధులు నిర్వహిస్తున్నవార్డులో తప్పులు జరిగితే దానికి ఆర్.ఓ నే పూర్తి బాధ్యవహించాల్సి వస్తుందని, విధుల నిర్వహణలో రాజకీయ పార్టీల ఒత్తిడిని అధిగమించి ఎన్నికల విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని ఆదేశించారు. ముఖ్యంగా ఎన్నికల విధులు కేటాయించబడిన ఆర్.ఓలు, ఏ.ఆర్.ఓలు వారి దివిజన్లలో ఎలేక్ట్రోరోల్, ఓటర్ల ప్రాతిపదికన రిజర్వేషన్ల కేటాయింపు మరియు పోలింగ్ స్టేషన్లను పరిశీలించి, అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించుటకు చర్యలు తీసుకోవాలని ఆదేశిచారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రతి ఓటు ఎంతో ముఖ్యమని, కావున ఎలేక్ట్రోరోల్స్ పై ప్రత్యేక శ్రద్ధ వహించి అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆర్.ఓలు ఎన్నికల విధులు సమర్ధవంతంగా నిర్వహించటకు నగర పాలక సంస్థ అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించి సహకరిస్తుందన్నారు. ఈ సమావేశంలో ఇంచార్జ్ అదనపు కమిషనర్ సాంబశివరావు, డిప్యూటీ కమిషనర్లు బి. శ్రీనివాసరావు, సి.హెచ్ శ్రీనివాస్, సిటీ ప్లానర్ రాంబాబు, డి.సి.పి సూరజ్ కుమార్, ఎన్నికల విభాగం అధికారులు, సిబ్బంది, ఆర్.ఓ లు, ఏ.ఆర్.ఓ లు తదితరులు పాల్గొన్నారు.