రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా “స్టాప్ – వాష్ అండ్ గో” కార్యక్రమం
గుంటూరు, 02 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశాల మేరకు రాత్రి వేళల్లో రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజల భద్రత దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా విజిబుల్ పోలీసింగ్‌ను మరింత విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు టోల్‌గేట్‌తో పాటు జాతీయ రహదారులు, ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాలు మరియు ప్రమాదాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక వాహన తనిఖీలు చేపట్టారు. రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు హైవే పెట్రోలింగ్ బృందాలు నిరంతరంగా గస్తీ...