గుంటూరు, 17 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఓటరు జాబితా సవరణ నిర్దిష్ట సమయంలో పూర్తి కావాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ అన్నారు. జాబితా సవరణ తదితర అంశాలపై గురువారం జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రధాన అధికారి మాట్లాడుతూ పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఫారం 6, 7, 8 దరఖాస్తులు, ఫోటోల నాణ్యత, ఫోటోల అనుసంధానంపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆగస్టు 30వ తేదీ వరకు అందిన దరఖాస్తులను పక్కాగా విచారణ చేపట్టాలని స్పష్టం చేశారు. జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి మాట్లాడుతూ జిల్లాలో ఎస్.ఐ.ఆర్ క్రింద చేపడుతున్న విచారణలు, ఫారం 6, 7, 8 పై చేపడుతున్న చర్యలు వివరించారు.