BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 24 September 2026, 12:28 am Posted by : Raghunath Rolla

పేదల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అండ

శాసనసభ్యులు వనమాడి కొండబాబు

కాకినాడ బ్యూరో, 23 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : పేదల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని, పేద ప్రజలను సొంత కుటుంబ సభ్యులుగా భావించి, ఆపద సమయంలో అండగా నిలిచి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు. బుధవారం శాసనసభ్యులు వారి స్వగృహం జగన్నాధపురం నందు నిర్వహించిన కార్యక్రమంలో కాకినాడ సిటీ నియోజకవర్గం స్థానిక 18వ డివిజన్ కి చెందిన గాదం మధుసూదన్ రావు కు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరు అయిన సుమారు 5,03,071 రూపాయల చెక్కును బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పేద ప్రజలను సొంత కుటుంబ సభ్యులుగా భావించి, ఆపద సమయంలో అండగా నిలుస్తుందని, ఏ కుటుంబానికైనా అనారోగ్య సమస్య వచ్చి ఆర్థిక ఇబ్బందులు ఎదురైతే, ప్రభుత్వ సహాయాన్ని అందేలా చేసి ప్రతి కుటుంబానికి అండగా నిలబడడం జరుగుతుందని పేర్కొన్నారు.
బాధిత కుటుంబసభ్యులు గాదం మధుసూదన్ రావు మాట్లాడుతూ సీఎం సహాయనిధి ద్వారా తమ కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించిన చంద్రబాబు నాయుడు , కూటమి ప్రభుత్వానికి, తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆర్థిక సహాయం అందేలా కృషి చేసిన శాసనసభ్యులు వనమాడి కొండబాబు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇంచార్జ్ బొడ్డు శివాజీ, మేరేటి బ్రహ్మస్వామి, పినపోతు శివ, సింహాద్రి, నరసింహస్వామి, మోస తాతారావు, తదితరులు పాల్గొన్నారు.