అణగారిన వర్గాల బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చిలకలూరిపేట, 31 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : చిలకలూరిపేట రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యం ప్రదర్శించిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. క్షతగాత్రులకు వైద్యం అందించడంలో, మృతుల కుటుంబాలకు ఎక్స్.గ్రేషియా ప్రకటించే విషయంలో స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు వ్యవహరించిన తీరు సక్రమంగా లేదని పేర్కొన్నారు. ఈమేరకు మందకృష్ణ మాదిగ సోమవారం గుంటూరులో మీడియాతో మాట్లాడారు. చిలకలూరిపేట రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం...