ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం
కూటమి నాయకుల సమన్వయ సమావేశం లో పాల్గొన్న కొత్తపేట నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ డా. బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బ్యూరో, 15 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణ, కూటమి అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహాలపై చర్చించేందుకు డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కూటమి నాయకులు నేడు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్...