BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 15 September 2026, 11:07 pm Posted by : Raghunath Rolla

ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం

కూటమి నాయకుల సమన్వయ సమావేశం లో పాల్గొన్న కొత్తపేట నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ బండారు శ్రీనివాస్

డా. బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బ్యూరో, 15 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణ, కూటమి అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహాలపై చర్చించేందుకు డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కూటమి నాయకులు నేడు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధుర్, అమలాపురం పార్లమెంటరీ జనసేన ఎన్నికల నిర్వహణ కమిటీ కో-ఆర్డినేటర్, ప్రభుత్వ విప్, తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, అమలాపురం బీజేపీ నాయకులు అయ్యజి వేమతో ,అమలాపురం పార్లమెంటరీ ఎన్నికల నిర్వహణ కమిటీ కోఆర్డినేషన్ టీమ్ ప్రధాన సభ్యులు బండారు శ్రీనివాస్ పాల్గొన్నారు.రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూటమి తరఫున సమన్వయంతో పోటీ చేసి అత్యధిక స్థానాల్లో విజయం సాధించే దిశగా అనుసరించాల్సిన వ్యూహాలపై నాయకులు విస్తృతంగా చర్చించారు. కూటమిలోని మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు పరస్పర సమన్వయంతో పనిచేసి ప్రతి స్థానంలో కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని నిర్ణయించారు.ఎన్నికల ప్రక్రియలో స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని సమర్థవంతమైన కార్యాచరణ రూపొందించాలని, కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త సమన్వయంతో ముందుకు సాగాలని సమావేశంలో నేతలు పిలుపునిచ్చారు.