విద్యార్థులు బాధ్యతతో మెలగాలి : బోయపాటి శ్రీను
గుంటూరు, 08 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : సమాజం పట్ల ప్రతి విద్యార్థి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రముఖ సినీ దర్శకుడు, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి బోయపాటి శ్రీను సూచించారు. విద్యార్థులు చదువుతో పాటు విజ్ఞత, సంస్కారం, లౌక్యం, బాధ్యతాయుతమైన లక్షణాలను అలవరచుకోవాలని కోరారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తాను ఏఎన్యూ పూర్వ విద్యార్థినని, విశ్వవిద్యాలయం అందించిన సర్టిఫికెట్ తన సినీ జీవితంలో ఎంతో కీలకంగా...