బియ్యం అక్రమ రవాణా అరికట్టుటకు పటిష్ట చర్యలు

గుంటూరు, 02 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ప్రజా పంపిణీ వ్యవస్థ (పి.డి.ఎస్) బియ్యం అక్రమ రవాణా అరికట్టుటకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు వట్టిచెరుకూరు తహసిల్దార్ కె. రాజీవ్ కుమార్ తెలిపారు. మంగళవారం "చౌక బియ్యం పక్కదారి" శీర్షికన ప్రత్తిపాడు, పెదనందిపాడు, కాకుమాను మండలాల నుండి వట్టిచెరుకూరు మండలం అనంతవరప్పాడుకు బియ్యాన్ని లారీలలో ఎగుమతి చేస్తున్నారని పేర్కొంటూ ఒక దిన పత్రికలో ప్రచురితమైన వార్తపై తహసిల్దార్ స్పందిస్తూ ప్రభుత్వం పేదలకు ఉచితంగా పంపిణీ చేస్తున్న పి.డి.ఎస్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టే...