BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 10 September 2026, 1:41 pm Posted by : Raghunath Rolla

ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఎస్టి కమిషన్ చైర్మన్

పామిడి, 10 సెప్టెంబర్ 2026 : అనంతపురం జిల్లా, పామిడి మండలం, పాల్యం తండాలో గిరిజన ప్రజలతో బుధవారం నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సొల్ల బొజ్జి రెడ్డి పాల్గొని గిరిజన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ తో పాటు ఎస్టి కమిషన్ సభ్యులు పి. వెంకటప్ప, కె మల్లేశ్వరరావు లు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా పాల్యం తాండ గిరిజన ప్రజలు ఎస్టి కమిషన్ చైర్మన్ కు పలు సమస్యలు వివరిస్తూ వినతి పత్రాలు సమర్పించారు. ఈ సమస్యలన్నీ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి తప్పక పరిష్కరిస్తామని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సొల్ల బొజ్జి రెడ్డి తండా ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసులు, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి శ్రీనివాసులు, తహసిల్దార్ షర్మిల, ఎంపీడీవో ప్రభాకర్ నాయక్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుధాకర్, ఎస్టీ నాయకులు, గిరిజన ప్రజలు తదితరులు పాల్గొన్నారు.