మట్టి గణపతులను ప్రోత్సహించాలి

పర్యావరణహితంగా వినాయక చవితి జరుపుకోవాలి : వడ్రాణం హరిబాబు గుంటూరు, 15 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని జి‌డి‌సి‌ఎం‌ఎస్ చైర్మన్ వడ్రాణం హరిబాబు గుంటూరు పరిధిలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను సందర్శించారు. చల్లావారిపాలెం, నల్లపాడు, ఏటుకూరు, రాజావారితోట, విసిదల, అడపబజార్ ప్రాంతాల్లోని మండపాలను సందర్శించి మట్టి గణపతి విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులతో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ...