శ్యామలానగర్‌ లెవెల్ క్రాసింగ్‌ 4 రోజులు మూసివేత

గుంటూరు, 03 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : అత్యవసర ట్రాక్‌ మరమ్మతు, ఓవర్‌హాలింగ్‌ పనుల నిమిత్తం గుంటూరు–నల్లపాడు స్టేషన్ల మధ్య శ్యామలానగర్‌లోని లెవెల్ క్రాసింగ్‌ (ఎల్ సి) నెం. 312ను నాలుగు రోజుల పాటు మూసివేయనున్నట్లు దక్షిణ తీర రైల్వే గుంటూరు డివిజన్‌ తెలిపింది. సెప్టెంబర్ 8 ఉదయం 7 గంటల నుంచి సెప్టెంబర్ 11 సాయంత్రం 7 గంటల వరకు లెవెల్ క్రాసింగ్‌ మూసివేయబడుతుంది. ఈ సమయంలో రోడ్డు రాకపోకలను కంగరిగుట్ట రోడ్ ఓవర్ బ్రిడ్జ్ (ఆర్ఓబి), రోడ్ అండర్ బ్రిడ్జ్...