BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 04 September 2026, 8:23 am Posted by : Raghunath Rolla

శ్యామలానగర్‌ లెవెల్ క్రాసింగ్‌ 4 రోజులు మూసివేత

గుంటూరు, 03 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : అత్యవసర ట్రాక్‌ మరమ్మతు, ఓవర్‌హాలింగ్‌ పనుల నిమిత్తం గుంటూరు–నల్లపాడు స్టేషన్ల మధ్య శ్యామలానగర్‌లోని లెవెల్ క్రాసింగ్‌ (ఎల్ సి) నెం. 312ను నాలుగు రోజుల పాటు మూసివేయనున్నట్లు దక్షిణ తీర రైల్వే గుంటూరు డివిజన్‌ తెలిపింది. సెప్టెంబర్ 8 ఉదయం 7 గంటల నుంచి సెప్టెంబర్ 11 సాయంత్రం 7 గంటల వరకు లెవెల్ క్రాసింగ్‌ మూసివేయబడుతుంది. ఈ సమయంలో రోడ్డు రాకపోకలను కంగరిగుట్ట రోడ్ ఓవర్ బ్రిడ్జ్ (ఆర్ఓబి), రోడ్ అండర్ బ్రిడ్జ్ (ఆర్ యు బి) మీదుగా మళ్లిస్తారు. ప్రజలు, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించి, రైల్వే అధికారులు ఏర్పాటు చేసిన దారి మళ్లింపు సూచనలను పాటించాలని గుంటూరు డివిజన్‌ కోరింది. మరమ్మతు పనులు సకాలంలో పూర్తిచేసేందుకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేసింది.