రూ. 3 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన డాక్టర్ పెమ్మసాని

గుంటూరు, 17 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గ్రామాల్లో మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు సంక్షేమ కార్యక్రమాలను కూడా సమాంతరంగా ముందుకు తీసుకెళ్తున్నామని కేంద్ర కమ్యూనికేషన్స్, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. పెదనందిపాడు మండలంలోని పరిటాలవారిపాలెం, ఉప్పలపాడు, జరుగులవారిపాలెం, నాగభైరవునిపాలెం గ్రామాల్లో డా. పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటించి, వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో గురువారం పాల్గొన్నారు. నాలుగు గ్రామాల్లో సుమారు రూ.3 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు పలు పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ...