చేబ్రోలు బ్రిడ్జికి మరమ్మతులు.. నూతన బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు
కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని గుంటూరు, 05 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ప్రమాదానికి గురై, రైలింగ్ దెబ్బతిని, ప్రస్తుతం ప్రమాదకర పరిస్థితిలో ఉన్న చేబ్రోలు బ్రిడ్జిని గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ శనివారం పరిశీలించారు. నియోజకవర్గ పర్యటనలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌తో కలిసి బ్రిడ్జి పరిస్థితిని ఆయన స్వయంగా పరిశీలించారు. ఇటీవల జరిగిన లారీ ప్రమాదం కారణంగా బ్రిడ్జి రైలింగ్ దెబ్బతినడంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న...