వార్డుల పునర్విభజన ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదల

గుంటూరు, 05 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్రస్తుతం ఉన్న 57 వార్డులను 76 వార్డులుగా పునర్విభజిస్తూ శనివారం ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన (జి.ఓ.ఎం.ఎస్. నెం.65, ఎం.ఎ.&యు.డి., తేదీ 24-03-2026) మేరకు గుంటూరు నగరంలో వార్డుల పునర్విభజన ప్రక్రియ చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పునర్విభజనలో భాగంగా 76 ప్రతిపాదిత వార్డుల ముసాయిదా సరిహద్దుల వివరాలను ఫారం-Iలో సెప్టెంబర్...