BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 10 September 2026, 2:09 pm Posted by : Raghunath Rolla

కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల హక్కుల కోసం రణభేరి

పారామెడికల్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయిస్ రాష్ట్ర అధ్యక్షులు వి. రమేష్ బాబు

గుంటూరు, 10 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని పారామెడికల్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయిస్ రాష్ట్ర అధ్యక్షులు వి. రమేష్ బాబు డిమాండ్ చేశారు. గురువారం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద సెప్టెంబర్ 13న గుంటూరు బ్రాడిపేటలోని సిపిఎం కార్యాలయం, గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో జరిగే ‘రణభేరి ఇక సమరమే’ పోస్టర్ ను ఆవిష్కరించారు. రమేష్ బాబు మాట్లాడుతూ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ ప్రభుత్వాలు అమలు చేయడం లేదన్నారు. 12 వేలుగా ఉన్న తమ వేతనం గత వైసిపి ప్రభుత్వం మూడు వేలు పెంచి, 15 వేలు ఇవ్వడం జరిగిందన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా తమకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పిన హామీని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.