BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 11 September 2026, 8:49 am Posted by : Raghunath Rolla

పీఠాధిపతి చిన్నాబత్తిని భాగ్యయ్య దశమ పీఠాధిపత్య వేడుకలు

గుంటూరు, 10 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరులోని డాన్ బాస్కో ప్రాంగణంలో మహాఘన శ్రీశ్రీశ్రీ డాక్టర్ చిన్నబత్తిని భాగ్యయ్య పీఠాధిపతుల దశమ పీఠాధిపత్య వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పీఠాధిపతులు మాట్లాడుతూ తమ ఆధ్వర్యంలోని 107 విచారణల కార్యకలాపాలకు ఇప్పటివరకు తానే బాధ్యత వహిస్తున్నట్లు తెలిపారు. ఆధ్యాత్మిక అభివృద్ధితో పాటు ఆర్థిక అభివృద్ధి, పిల్లలకు విద్యా సదుపాయాల కల్పన, పలు సేవా కార్యక్రమాలను నిర్వహించినట్లు చెప్పారు. రానున్న రోజుల్లో మరింత మెరుగ్గా సేవలు అందించేందుకు తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ దశమ పీఠాధిపత్య వేడుకలకు మహోన్నత కార్డినల్, పీఠాధిపతులు, పూజ్య గురువులు, బ్రదర్స్, కన్యాస్త్రీలతో పాటు సుమారు 5 వేల నుంచి 10 వేల మంది భక్తులు పాల్గొననున్నట్లు తెలిపారు.