గుంతలు లేని రోడ్లే లక్ష్యంగా పనిచేయాలి : జిఎంసి కమిషనర్
గుంటూరు, 15 సెప్టెంబర్ 2026. భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు నగరంలో గుంతలు లేని రోడ్లే లక్ష్యంగా పనిచేయాలని, అన్ని రోడ్లలోని పాట్హోల్స్ను యుద్ధప్రాతిపదికన పూడ్చాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కమిషనర్ విద్యా నగర్, వికాస్ నగర్, జేకేసి కాలేజీ రోడ్ తదితర ప్రాంతాల్లో పర్యటించి, అభివృద్ధి, పారిశుధ్య పనులను తనిఖీ చేసి, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, వర్షాల నేపథ్యంలో నగరంలోని ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో...