BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 03 September 2026, 8:05 pm Posted by : Raghunath Rolla

వినాయక చవితి కి అనుమతులు ఇక మరింత సులభం !

వినాయక చవితి పండుగ సందర్భంగా పందిళ్ల ఏర్పాటుకు అనుమతులు ఇక మరింత సులభం అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వినాయక మండపాలు/పందిళ్ల ఏర్పాటుకు అవసరమైన అనుమతుల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఏకీకృత ఆన్‌లైన్ అనుమతి వ్యవస్థ అందుబాటులోకి తీసుకురాబడింది.
* ganeshutsav.net ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు
* పోలీస్, అగ్నిమాపక,మున్సిపల్, విద్యుత్ మరియు రెవెన్యూ శాఖల సమన్వయంతో అనుమతుల ప్రక్రియ నిర్వహించబడుతుంది
* అనుమతి మంజూరైన అనంతరం క్యూఆర్ కోడ్‌తో కూడిన డిజిటల్ అనుమతి పత్రం పొందవచ్చు
* ఈ సేవ పూర్తిగా ఉచితం
* సురక్షితమైన, ప్రశాంతమైన మరియు క్రమబద్ధమైన వినాయక చవితి వేడుకల నిర్వహణ కోసం నిర్వాహకులు ఈ ఆన్‌లైన్ సదుపాయాన్ని వినియోగించుకుని ముందస్తుగా దరఖాస్తు చేసుకొనగలరు.