ఒకరికి రెండు ఓట్లు ఉండడానికి వీలులేదు : మాజీ మంత్రి అంబటి రాంబాబు
గుంటూరు, 10 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ప్రజాస్వామ్యంలో ఒకరికి ఒక ఓటు మాత్రమే ఉండాలని, రెండు ఓట్లు ఉండే అవకాశం ఉండకూడదని మాజీమంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఇదే అంశంపై గురువారం గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అదేవిధంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో అంబటి రాంబాబు మాట్లాడుతూ గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గంలో అనేక డబల్ ఓట్లు ఉన్నాయన్నారు. (సర్) ప్రక్రియ ద్వారా డబల్ ఓట్లను రద్దు చేయాలని డిమాండ్...