అక్టోబర్ 1న రేపల్లె లో “పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా” కార్యక్రమం
ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి : రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ రేపల్లె, 28 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిది : అన్ని శాఖల అధికారులు,ప్రజా ప్రతినిధులు అందరూ సమన్వయంతో పనిచేసి ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ తెలిపారు. అక్టోబర్ 1న గురువారం రేపల్లె పట్టణంలో నిర్వహించనున్న “పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా” సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు...